సికింద్రాబాద్ అక్టోబర్ 28 (ఇయ్యాల తెలంగాణ ):కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించిన సందర్భంగా కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు వెన్నెల నివాసానికి చేరుకొని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెన్నెల విూడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ టికెట్ కేటాయించిన కేంద్ర నాయకులకు రాష్ట్ర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలోనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కలిసి వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగుతానని ఆమె తెలిపారు అధిష్టానం ఆదేశాల తీసుకొని ప్రచారానికి ముందుకు సాగుతాను తెలిపారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
- Homepage
- Telangana News
- కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
Leave a Comment