ఓఆర్‌ఆర్‌ పై స్పీడ్‌ లిమిట్‌ 120

 

హైదరాబాద్‌, జూన్‌ 28, (ఇయ్యాల తెలంగాణ ):హైదరాబాద్‌ కు మణిహారంగా నిలిచిన ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనదారులు మరింత వేగంతో దూసుకుపోవచ్చు. ఈ మేరకు పురపాలకశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ పై గరిష్టంగా 100 కిలోవిూటర్ల వేగంతో వెళ్లడానికి వాహనదారులకు అనుమతి ఉంది. అయితే ఈ వేగాన్ని తాజాగా 120 కిలోవిూటర్లకు పెంచింది ప్రభుత్వం. పురపాలకశాఖ, ఓఆర్‌ఆర్‌ అధికారులతో మంత్రి కేటీఆర్‌ మంగళవారం సవిూక్ష నిర్వహించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రయాణికుల భద్రతకు మరిన్ని మెరుగైన చర్యలు తీసుకుంటాం అన్నారు. సవిూక్ష అనంతరం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ విూడియాతో మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్‌ పై స్పీట్‌ లిమిట్‌ ను 120 కిలోవిూటర్లకు పెంచినట్లు వెల్లడిరచారు.హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ టెండర్‌ అప్పగింత విషయంపై వివాదం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిరదని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ పై ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తుందని. ఇది ఏటా ఐదు శాతం పెరగుతూ పోయినా 30 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి 30 వేల కోట్ల ఆదాయం చేకూరేదన్నారు. సొంత ప్రయోజనాలతో రాష్ట్రానికి వేలకోట్ల నష్టం వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సైతం తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ ఆరోపణలపై ప్రజలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలని పలుమార్లు డిమాండ్‌ చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....