ఐదు అంశాల పై వివరణ కోరిన గవర్నర్‌

హైదరాబాద్‌ ఆగష్టు 5, (ఇయ్యాల తెలంగాణ ): టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం లో విలీనానికి సంబంధించిన  బిల్లు జాప్యంపై రాజ్‌ భవన్‌ వివరణ ఇచ్చింది. కొన్ని అంశాలపై వివరణ గవర్నర్‌ తమిళిసై కోరారు.  1958 నుండి ఆర్టీసీ లో కేంద్ర గ్రాంట్‌ లు, వాటా లు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లు లో ఎలాంటి వివరాలు లేవు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్‌ ఎచీ ప్రకారం ఆర్టీసీ స్థితి ని మార్చడం పై సమగ్ర వివరాలు బిల్లు లో లేవు.  ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం…వారి సమస్యల కు ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్స్‌ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడ తాయి అని గవర్నర్‌ వివరణ కోరారు.  విలీనం డ్రాఫ్ట్‌ బిల్లు లో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా పెన్షన్‌ ఇస్తారా, వారి కి ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా అన్ని ప్రయోజనాలు ఇవ్వడాని కి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.  ప్రభుత్వ ఉద్యోగుల లో కండక్టర్‌, కంట్రోలర్‌ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్‌ నార్మలైజేషన్‌ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగుల కు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని  గవర్నర్‌ కోరారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....