ఏప్రిల్‌ 30న పోలీసు కానిస్టేబుల్‌ తుది రాతపరీక్షలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది పరీక్షల ప్రక్రియ ఏప్రిల్‌ 30తో ముగియనుంది. పోలీసు కానిస్టేబుల్‌ (సివిల్‌), పోలీసు కానిస్టేబుల్‌(ఐటీ డ సీవో) ఉద్యోగాలకు సంబంధించిన తుది రాతపరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఖరారు చేసింది. ఏప్రిల్‌ 30న ఈ రాతపరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. సివిల్‌ ఉద్యోగాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఐటీ అండ్‌ సీవో ఉద్యోగాలకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్‌ 24 తేదీ ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్‌ 28న అర్థరాత్రి 12 గంటల వరకు సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసేప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే బబీజూజూనీతీబిఏబిబశ్రీజూతీప.తిని కు మెయిల్‌ లేదా 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొంది.తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఈఈ(సివిల్‌) పోస్టులకు ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. 

మే 21న ఏఈఈ పోస్టులకు ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, అగ్రికల్చర్‌, మెకానికల్‌ పోస్టులతో పాటు సివిల్‌ పోస్టులకు కూడా ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 21న అధికారికంగా ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 8న ఎలక్ట్రికల్‌ డ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌Ñ మే 9న అగ్రికల్చర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 21, 22 తేదీల్లో రెండు షిప్టుల్లో ఏఈఈ(సివిల్‌) పోస్టులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. తుది స్కోరు ఖరారులో నార్మలైజేషన్‌ పద్ధతిని పాటించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్‌ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌`2023 నోటిఫికేషన్‌ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఏప్రిల్‌ 19న విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 1261 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏప్రిల్‌ 19 నుంచి మే 9న సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. యూపీఎస్సీ సీఎంఎస్‌ పరీక్ష జులై 16న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....