ఎన్నికలు నిర్వహణలో పోలీస్‌ ల పాత్ర చాలా కీలకమైందని జిల్లా SP ఎగ్గడి భాస్కర్‌

జగిత్యాల సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ ); ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు ప్రకారం నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు నిర్వహణలో పోలీస్‌ ల పాత్ర  చాలా కీలకమైందని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌ అన్నారు.సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో రాబోవు రాష్ట్ర శాసనసభ ఎన్నికల నియమావళి, ఎన్నికలకు సంబంధించి పోలీస్‌  అధికారులు తీసుకోవలసిన చర్యలపై మాస్టర్‌ ట్రైనర్‌  పడాల తిరుపతి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చే శిక్షణ తరగతులు  నిర్వహించారు..ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎలక్షన్స్‌ సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణలో, పర్యవేక్షణ, క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు.జగిత్యాల జిల్లాలో 5 నియోజకవర్గాల పరిధిలో ఉండటం జరిగిందని ఇప్పటికే ఎన్నికల విధులకు సంబంధించి పోలీస్‌  సెక్టార్‌ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.. .ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం ఎన్నికలను ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఒకటికి రెండుసార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని  తెలిపారు.పోలీసు అధికారులు  సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా, సమస్యలు సృష్టించే వారినీ బైండోవర్‌ చేయాలని తెలిపారు. ఇంతకు ముందు

ఎలక్షన్స్‌ సమయంలో సమస్యలును సృష్టించిన వారి పై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలీస్‌ అధికారులు ఎలక్షన్‌ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై  చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు.ఈ సందర్భంగా ఎన్నికల నియమావళి పై పోలీసు అధికారులకు అవగాహన కలిగించిన మాస్టర్‌ ట్రైనర్‌ పడాల తిరుపతి ని సన్మానించి, ప్రశంస పత్రం అందజేశారు.ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర రావు, డిఎస్పీలు రవీంద్ర కుమార్‌ ,వెంకటస్వామి, రవీంద్ర రెడ్డి, రఘు చందర్‌,డీవీ  రంగారెడ్డి, ఎస్భీ ,సిసిఎస్‌, ఐటీ కోర్‌ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్‌ ఇన్స్పెక్టర్‌ లు,సి.ఐలు, ఎస్‌.ఐ లు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....