ఎంపీ విజయేంద్రప్రసాద్‌తో బండి సంజయ్‌ భేటీ..

 

హైదరాబాద్‌  జులై 10, (ఇయ్యాల తెలంగాణ ): ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్‌తో ఎంపీ బండి సంజయ్‌ భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన బండి అరగంటకు పైగా పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న వరంగల్‌ సభలోని బండి ప్రసంగాన్ని తిలకించారు. ప్రసంగం పూర్తిగా విన్నాక బండికి పలు సలహాలు, సూచనలు విజయేంద్రప్రసాద్‌ చేసినట్లు తెలియవచ్చింది. అయితే ఈ భేటీ వెనుక ఏం జరిగింది..? ఈ సమయంలోనే ఎందుకు భేటీ అయ్యారు..? అనేది తెలియట్లేదు గానీ సోషల్‌ విూడియాలో, బీజేపీ, బీఆర్కాగా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకు బండి.. విజయేంద్రప్రసాద్‌ ఇంటికెళ్లి భేటీ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ మధ్య ‘రజాకార్‌ ఫైల్స్‌’ సినిమాకు దర్శకత్వం వహించాల్సిందిగా సీనియర్‌ నేతలు తరుణ్‌ చుగ్‌, బండి సంజయ్‌గా కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు సవిూపిస్తుండటంతో మరోసారి నడ్డా ప్రస్తావనకు తీసుకురావడంతో సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గతంలో ఆయన రజాకార్ల ఆగడాలపై దర్శకత్వం వహించిన ‘రాజన్న’ సినిమా గురించి ప్రస్తావన వచ్చిందని సమాచారం. తెలంగాణ చరిత్రతో ముడిపడిన అంశాలు, గతంలో హైదరాబాద్‌ రాష్ట్రంలో పేదలపై జరిగిన అరాచకాలు, దాష్టీకాలపై ‘రజాకార్‌ ఫైల్స్‌’సినిమా తీసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని సోషల్‌ విూడియాలో ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్‌ ఇలా ప్రత్యేకంగా ఇంటికెళ్లి మరీ భేటీ కావడం ఇది రెండోసారి. దీంతో సినిమా గురించే అనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.ఎస్‌ శ్రేణులు చిత్రవిచిత్రాలుగా చెప్పుకుంటున్నారు.ఇదిలా ఉంటే.. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్‌ విూడియా కనిపించడంతో అప్పట్లో ఈ బండి సంజయే కదా.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ రిలీజ్‌ టైమ్‌లో హడావిడి చేసిందని గుర్తుకు తెచ్చుకుని మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పట్లో సినిమాను, డైరెక్టర్‌ రాజమౌళిని విమర్శించారు. కాగా.. రాష్ట్రపతికోటాలో పెద్దల సభకు కేంద్రం రికమెండ్‌ చేయడంతో సోషల్‌ విూడియాలో రాజమౌళికి, ఆయన తండ్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే.. బండిపై మాత్రం ఓ రేంజ్‌లో నెటిజన్లు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ట్రోల్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి రెండుసార్లు విజయేంద్రప్రసాద్‌తో ఇంటికెళ్లి మరీ భేటీ అయ్యారు.. అట్లుంటది మరి సినిమావోళ్లతోని అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....