ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వానికి తెలంగాణ HIGH COURT GREEN SIGNAL


హైదరాబాద్‌ ఆగష్టు 30 (ఇయ్యాల తెలంగాణ ):ఉపాధ్యాయుల బదిలీలపై కేసీఆర్‌ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తుది తీర్పుకు లోబడి బదిలీలు ఉండాలని తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీచర్‌ బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. టీచర్‌ యూనియన్‌ నేతలకు 10 అదనపు పాయింట్లను హైకోర్టు తప్పు పట్టింది. యూనియన్‌ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండానే బదిలీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.ఉపాధ్యాయుల దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు వెల్లడిరచింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని హైకోర్టు తెలిపింది. తుది తీర్పుకు లోబడే బదిలీలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....