ఈనెల అక్టోబర్‌ 15వ తేదీన పార్టీ MLA అభ్యర్థులతో BRS అధినేత,CM KCR భేటీ.. బి ఫారాలను అభ్యర్థులకు అందజేత..

 హైదరాబాద్‌ అక్టోబర్ 9 (ఇయ్యాల తెలంగాణ) ;పార్టీ మేనిఫెస్టో విడుదల.

అక్టోబర్‌ 15., 16., 17.,18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన..

నవంబర్‌ 9 న రెండు చోట్ల సిఎం కేసీఆర్‌ నామినేషన్‌;బీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు అక్టోబర్‌ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్‌ లో సమావేశం కానున్నారుఈ సమావేశంలోనే అభ్యర్థులకు బీఫారాలను అధినేత సిఎం కేసీఆర్‌ అందచేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు అధ్యక్షులు సిఎం కేసీఆర్‌ వివరిస్తారు.  సూచనలు ఇస్తారు.కాగా.. అదే సందర్భంలో బీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు,  బిఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు.తరువాత  అదేరోజు (అక్టోబర్‌ 15) న హైద్రాబాద్‌ నుంచి బయలుదేరి., హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు

సిఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు;అక్టోబర్‌ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు.  17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో సిఎం కేసీఆర్‌  పాల్గొంటారు.అక్టోబర్‌ 18 నాడు.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సిఎం పాల్గొంటారు.

సిఎం కేసీఆర్‌ నామినేషన్లు :నవంబర్‌ 9వ తేదీన గజ్వేల్‌, కామారెడ్డి … రెండు నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నారు.  ఇందులో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  అనంతరం గజ్వేల్‌ లో సిఎం కేసీఆర్‌ మొదటి నామినేషన్‌ వేస్తారు.ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్‌ వేస్తారు.  అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....