ఈటెలకు బాధ్యతలు ?

హైదరాబాద్‌, జూన్‌ 3, (ఇయ్యాల తెలంగాణ ):త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని సీనియర్‌ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో అంతర్గత తగదాలు నాయకుల మధ్య విభేదాలు చక్కదిద్దేలా బీజేపీ అధిష్ఠానం వ్యూహాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. తెలంగాణకు సంబంధించి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్‌ ? రాష్ట్ర అధ్యక్ష మార్పు ఉన్నా లేకున్నా పార్టీపరంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎలక్షన్‌ కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. టికెట్ల కేటాయింపు, ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలకు కీలకంగా వ్యవహరించే ఈ కమిటీ బాధ్యతలు సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌కు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఈటలకు ఢల్లీి పెద్దల నుంచి సంకేతాలు వచ్చినట్టు సమాచారం. ఈ మధ్యే ఢల్లీి వెళ్లి పార్టీ పెద్దలతో ఈటల సమావేశమైన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి వచ్చిన ఆ సంకేతాలను బట్టే ఈటల నిన్న ట్వీట్‌ చేసినట్టు తెలుస్తోంది.ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైంది, ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికుడిలా పనిచేస్తానని ట్వీట్‌లో ఈటల పేర్కొన్నారు. ఈటల నిన్న రాత్రి చేసిన ట్వీట్‌ చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దాదాపు 60 పదాలతో కూడిన ఈటల ట్వీట్‌ అనేక విషయాలను చెప్పకనే చెప్తోంది. తెలుగులోనే కాదు ఇదే విషయాన్ని హిందీలోనూ ఈటల ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా, జాతీయ బీజేపీ, తెలంగాణ బీజేపీ ట్విట్టర్స్‌కు ఈ ట్వీట్‌ను ఆయన ట్యాగ్‌ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 56 వేల మంది ఈ ట్వీట్‌ను చూశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....