హైదరాబాద్ జులై 10, (ఇయ్యాల తెలంగాణ ): బీజేపీ నేతలకు హై సెక్యూరిటీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ లకు భద్రత పెంచారు. వారిద్దరికి కేంద్ర భద్రత బలగాలు ఇకనుంచి భద్రత కల్పించనున్నాయి. సీఆర్పిఎఫ్ భద్రత పరిధిలోకి ఇద్దరు నేతలు వుంటారు. ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కేటాయించినట్లు సమాచారం. భద్రత అడిగినా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే. సోమవారం నాడు ఇద్దరు నాయకుల ఇళ్లకు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెళ్లారు. ఈటల రాజేందర్ కు వై ప్లస్ కేటగిరి, ధర్మపురి అర్వింద్ కు వై కేటగిరి స్థాయి భద్రత కల్పిస్తారు
- Homepage
- Telangana News
- ఈటల, అర్వింద్ కు కమాండోల భద్రత
ఈటల, అర్వింద్ కు కమాండోల భద్రత
Leave a Comment