ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి : BJP మహిళా మోర్చా


బిజెపి మహిళా మోర్చా ఆద్వర్యంలో కోటిలోని  ఆరోగ్య విభాగం వద్ద పెద్ద ఎత్తున ధర్నా

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రములోని ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ శిల్పారెడ్డి ఆద్వర్యం లో వందలాది మంది మహిళలు కోటి లోని  ఆరోగ్య విభాగం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.ఒక సందర్బం లో మహిళలు ఆరోగ్య విభాగం లోకి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్తితి నెలకొంది. ఈసందర్బంగా డాక్టర్‌ శిల్పారెడ్డి మాట్లాడుతూ ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వారికి ప్రతి నెల జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేసారు.అనంతరం జాయింట్‌ డైరక్టర్‌ పద్మజను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా జాయింట్‌ డైరక్టర్‌ పద్మజ మాట్లాడుతూ ఆశ వర్కర్లకు న్యాయం చేస్తామని హావిూ ఇచ్చినట్లు శిల్పారెడ్డి తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....