ఆలయాల అభివృద్ధికి కృషి ( బల్కంపేట ఎల్లమ్మ )

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఇయ్యాల తెలంగాణ ): ఆలయాల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ వారి ఆలయంలో దాతల సహకారంతో భక్తుల సదుపాయం కోసం చేపట్టిన  పలు అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రూ.  8 లక్షల వ్యయంతో  ఎల్లమ్మ అమ్మవారి ఆలయ రాజగోపుర ద్వారానికి గల  రాగి తొడుగులపై బంగారు పాలిష్‌, రూ. 3 లక్షల వ్యయంతో టేక్‌ తో చేయించిన శ్రీ పోచమ్మ ఆలయ ద్వారాలకు రాగి రేకులతో కూడిన బంగారు పాలిష్‌, రూ. 2.75 లక్షల వ్యయంతో టికెట్‌ వెండిరగ్‌ మెషిన్‌, రెండు 5000 లీటర్ల సామర్ధ్యం కలిగిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ లను మంత్రులు ప్రారంభించారు.

 అనంతరం మంత్రులు మాట్లాడుతూ….  సీయం కేసీఆర్‌ తోడ్పాటుతో రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణ, పలు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా భక్తులకు మైరుగైన సౌకర్యాలు,  శ్రీఆన్‌ లైన్‌ సేవలు కల్పించడంతో  ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ముఖ్యంగా పర్వదినాలలో అన్ని పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా   ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించి దశ లవారీగా ప్రభుత్వం  ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. ఆధ్యాత్మిక, ఆహ్లాదకరంగా ఉండేలా  భక్తులకు అన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తోందని వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్‌  అనిల్‌ కుమార్‌, ఈవో నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....