ఆరుగురు అభ్యర్థుల ఖరారు

మహబూబ్‌ నగర్‌ అక్టోబర్ 28 (ఇయ్యాల తెలంగాణ ):కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగిలిపోయిన ఆరు స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. మాజీ మంత్రి చిన్నారెడ్డికిచిటేం కుటుంబానికి చెందిన డాక్టరు పర్ణిక రెడ్డి కి జాబితాలో చోటు దక్కడం విశేషం కాగా, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌, పెద్ద మందడి ఎంపిపి మెఘారెడ్డి కి అవకాశం దక్కక పోవడం తో వారి అనుచరగణం నిరాశకు గురయ్యారు. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ప్రకటించడం తో , అధికార పార్టీ కి ధీటుగా ఎన్నికల ప్రచారానికి  పార్టీ నాయకులు, శ్రేణులు సన్నద్ధం అవుతున్నారు. మొదటి విడత  8 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించిన హస్తం పార్టీ, రెండవ జాబితాలో లిస్టులో మిగిలిపోయిన ఆరు స్థానాలు అభ్యర్థుల ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడిరది.

రెండవ జాబితాలో మక్తల్‌ అసెంబ్లీ నియోకవర్గం నుంచి ఒకే ఒక్క బీసీ అభ్యర్థి వాకిటి శ్రీహరికి పోటీ చేసే అవకాశం లభించింది. పలు సవిూకరణాల కారణంగా పలువురి పేర్లు తెరవిూదికి వచ్చాయి. గత మూడు దశాబ్దాలుగా పార్టీ నమ్ముకొని పనిచేస్తున్న శ్రీహరి చివరికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఆశీస్సులతో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. వనపర్తి నుండి పోటీ చేసే అవకాశం  పెద్ద ముందటి ఎంపీపీ మేఘ రెడ్డికి దక్కుతుందని అందరూ ఊహించారు. చివరకు కాంగ్రెస్‌ అధిష్టానం, సోనియా గాంధీ ఆశీస్సులతో చిన్నారెడ్డికి టికెట్‌ దక్కింది.  చిట్టెం కుటుంబం నుండి మరొకరికి నారాయణపేట నియోజకవర్గ నుండి పోటీ చేసే అవకాశం లభించింది. మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టె రామ్మోహన్‌ రెడ్డి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్వయనా సోదరుడు చిట్టేం వెంకటేశ్వర రెడ్డి కుమార్తె పర్నీక రెడ్డి కి పోటి చేసే అవకాశం లభించింది. పర్నీక రెడ్డి అప్పట్లో నారాయణ పేట ఎమ్మెల్యేగా ఉన్న ఆమె తాత చిట్టెం నర్సిరెడ్డి తండ్రి వెంకటేశ్వర రెడ్డి నక్సలైట్ల కాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌, పిసిసి ప్రధాన కార్యదర్శి అనురుద్‌ రెడ్డి మధ్య టికెట్‌ కోసం మొదటి నుండి పోరు సాగుతూ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీకి గెలిచి వారి తరఫున ప్రచారాలు నిర్వహించడం. రాహుల్‌ గాంధీ బట్టి విక్రమార్కు పాదయాత్రలను జయప్రదం చేయడంలో ప్రధాన భూమికలు పోషించడం. కోమిటిరెడ్డి  బ్రదర్స్‌ కు అత్యంత సన్నిహితుడు కావడంతో అనిరుధ్‌ కు టికెట్‌ లభించింది. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్కు టికెట్టు దొరకకపోవడంతో ఆయన అనుచర వర్గంలో నిరాశలు మునిగిపోయింది.  నారాయణపేట నుండి అయినా పోటీ చేసే అవకాశాలు లభిస్తుందని ఆశించారు. కానీ ఆ అవకాశం కూడా దక్కలేదు. వనపర్తి నుండి టికెట్‌ ఆశించిన మేఘా రెడ్డి పేరే జాబితాలో ఉంటుందని అందరూ భావించారు. కానీ సోనియా ఆశీస్సులతో ఆ అవకాశం మాజీ మంత్రి చిన్నారెడ్డికి దక్కింది. దేవరకద్ర నియోజకవర్గం నుండి డిసిసి అధ్యక్షులు జి మధుసూదన్‌ రెడ్డి పేరు మొదటి జాబితాలోని రావాల్సి ఉంది. కారణాలు ఏవి అయినా రెండో జాబితాలో ఆయన పేరు వచ్చింది. శుక్రవారం ప్రకటించిన జాబితాలో ఆయన పేరు రావడంతో అభిమానులు ఉత్సాహం నెలకొంది.ఈ మధ్య భారతీయ జనతా పార్టీ నుండి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ రెడ్డికి మహబూబ్నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం దొరికింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొదటి రెండవ జాబితాలను కలిసి మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. వీరిలో గద్వాల, మక్తల్‌,  షాద్నగర్‌ నియోజకవర్గం బీసీలకు కేటాయించగా మిగిలిన వాటిలో అల్లంపూర్‌ అచ్చంపేట నియోజకవర్గం లో ఎస్సీలకు రిజర్వు కాగా మిగిలిన 10 స్థానాల్లో అగ్రవర్ణాలకే దక్కాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గద్వాల నుండి సరిత, నారాయణ పేట  నుండి పర్ణిక కా రెడ్డికి టికెట్‌ కేటాయించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇద్దరు మహిళలకు పోటీ చేసే అవకాశాలు దక్కాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో అధికారం టిఆర్‌ఎస్‌ పార్టీకి ధీటుగా ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.

 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....