ఆటో డ్రైవర్లకి డ్రైవింగ్‌ లైసెన్సులు అందజేత

పెద్దపల్లి ఆగష్టు 9 (ఇయ్యాల తెలంగాణ ):  పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లకి బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ దాసరి ఉష ఆధ్వర్యంలో  అఫ్జల్‌, మహమ్మద్‌ అలీ, జాకీర్‌, తన్వీర్‌, ఆరిఫ్‌, అఫ్జల్‌, తాజ్‌ ఖాన్‌,లోకమాన్‌, హవిూద్‌, సవిూర్‌, నసీర్‌ లకు 11 మందికి పైగా ఉచితంగా డ్రైవింగ్‌ లైసెన్సు అందజేశారు. అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ బహుజను లైన మనం ఆటో డ్రైవర్ల కొడుకులు ఆటో డ్రైవర్ల అవుతున్నారు. తప్ప మన జీవితాల్లో ఎలాంటి మార్పులు జరగడంలేదని, అది కేవలం బహుజన రాజ్యం తోనే సాధ్యమవుతుందన్నారు. కూలీ చేసుకునే పిల్లలనీ కోటీశ్వరులు చేసింది బహుజన సమాజ్‌ పార్టీ అని కోడిరగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి లక్షల్లో జీతాలు సంపాదించే విధంగా బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌  తీర్చిదిద్దారని అధికారం రాకముం దే విద్యార్థులకు, యువకులకు ఎంతో మేలు చేస్తున్నారని ఒకసారి అధికారం ఇస్తే ఎన్నో మంచి కార్యక్రమాలతో విూ ముందుకు వస్తామని అన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లు దాసరి ఉష  శాలువాతో సన్మానించి స్వీట్స్‌ పంపిణీ చేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్‌,  అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్‌,  పట్టణ ఉపాధ్యక్షులు మాచర్ల బబ్లూ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి అజీమ్‌, సుల్తానాబాద్‌ మండల కోశాధికారి అల్లెపు చంద్రశేఖర్‌, బివిఎఫ్‌ టీం చిన్ను, అబ్బు , ఎండీ సాదిక్‌ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....