అశ్వరావుపేట ఇన్స్‌ పెక్టర్‌ పై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్‌ జులై 4 (ఇయ్యాల తెలంగాణ ):దళిత సబ్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ను అవమానించి ఆయన ఆత్మహత్యాయత్నాని కారణమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఇన్స్పెక్టర్‌ జితేందర్‌ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాల సంఘాల జేఏసీ చైర్మన్‌  డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ బషీర్బాగ్‌ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇన్స్పెక్టర్‌ జితేందర్‌ రెడ్డి అకారణంగా మాల సామాజిక వర్గానికి చెందిన సబ్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీనివాస్‌ పై పోలీస్‌ స్టేషన్లో సిబ్బంది ఎదురుగా అవమానించారని వారు ఆరోపించారు. సబ్‌ ఇన్స్పెక్టర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కోరారు.ఇన్స్పెక్టర్‌ జితేందర్‌ రెడ్డి పై గతంలో అవినీతి ఆరోపణలు కారణంగా సస్పెన్షన్కు గురయ్యారని వారు గుర్తు చేశారు. రాజకీయ పలుకుబడితో విధుల్లోకి తిరిగి మల్లి వచ్చిన సబ్‌ ఇన్స్పెక్టర్‌ పై దుర్భాషలాడాలని వారన్నారు. సీఐపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేసి విధులనుంచి బహిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....