అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు : CM రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఇయ్యాల తెలంగాణ) : ప్రపంచ దేశాలతో  తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం నాడు సి ఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన ప్రసంగించారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్‌, చంద్రబాబు, కేసీఆర్‌ హైదరాబాద్‌ అభివృద్ధిని కొనసాగించారు. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం. తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐ తో కలిసి ముందుకు నడుస్తాం. 64ఐటీఐ లను స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్లుగా రూ.2000 కోట్లలతో డెవలప్‌ చేయబోతున్నాం. స్కిల్లింగ్‌ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నాం. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ లో జాయిన్‌ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్‌ ఇవ్వబోతున్నాం. తెలంగాణలో డ్రైపోర్ట్‌ ఏర్పాటు చేస్తాం. గతంలో అవుటర్‌ రింగ్‌ రోడ్‌ అవసరం లేదని కొందరు అన్నారు.. ఇప్పుడది హైదరాబాద్‌ కు లైఫ్‌ లైన్‌ గా మారిందని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....