అనతి కాలంలోనే ఆదర్శ పాలన అందించాం KCR

గజ్వేల్‌ జులై 5 (ఇయ్యాల తెలంగాణ ):దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని భారాసతో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌, వేములవాడ, నర్సాపూర్‌, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన వారినుద్దేశించి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే ఆదర్శంగా పాలన అందించిందని. విద్యుత్‌, సాగు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో భారాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే  మునుపెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్‌ పాలన కావాలని కోరుకున్నారని తెలిపారు. కేసీఆర్‌ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతో పాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని భారాస అధినేత వివరించారు. భారాస ఓటమితో రైతురాజ్యాన్ని అందించగల కేసీఆర్‌ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని  బాధపడ్డారని తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....