అది ED నోటీసు కాదు ..MODI నోటీసు MLC కవిత

నిజామాబాద్‌ సెప్టెంబర్‌ 15 (ఇయ్యాల తెలంగాణ ):తనకు మోడీ నోటీసు వచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు. గురువారం ఆమె నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈడీ నోటీసులు అందాయని కవిత తెలిపారు. నోటీసులను పార్టీ లీగల్‌ సెల్‌కు అందజేశాం. వారి సూచనల మేరకు ముందుకు వెళ్తాం. రాజకీయ కక్ష్యతోనే నోటీసులు ఇచ్చినట్లు బలంగా నమ్ముతున్నాం. తెలంగాణలో రాబోయే ఎన్నికల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తనకు నోటీసులు ఇచ్చారు. గత ఏడాది కాలం నుంచి ఆ కేసులో దర్యాప్తు జరుగుతోందని, ఇంకెన్నాళ్లు ఆ విచారణ ఉంటుందో తనకు తెలియదు. 2జీ కేసులో కూడా ఇంత కాలం విచారణ జరగలేదనుకుంటా. రాజకీయ ఉద్దేశంతోనే కేసు సాగుతోందని, తెలంగాణ ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకోరు. పార్టీ లీగల్‌ బృందం ఇచ్చే సలహాల మేరకు ముందుకు వెళ్తామన్నారు.తాము ఏ పార్టీతోనూ కలవలేదని, కేవలం తెలంగాణ ప్రజలు, భారత దేశ ప్రజలతో మమేకం అయ్యామన్నారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్‌ను కావాలనుకుంటున్నారని, దీంతో ఆ రెండు పార్టీలకు ఆ భయం పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. మేం ఎవరికీ బీ టీమ్‌ కాదన్నారు. అంతులేని టీవీ సీరియల్‌ తరహాలో విచారణ సాగుతున్నదని, అదేవిూ పెద్ద విషయం కాదన్నారు. బీజేపీ ఎన్నికల స్టంట్‌లో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెబుతారని కవిత పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....