అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి KCR

హైదరాబాద్‌ ఆగష్టు 1 (ఇయ్యాల తెలంగాణ );  ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజా వద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్‌, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జెండాఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వెహికిల్స్‌ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....