హైదరాబాద్, జూలై 14 (ఇయ్యాల తెలంగాణ) : అత్యంత ప్రసిద్దిగాంచిన దేవాలయాల్లో శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం చాలా ప్రాచుర్యమై నది.శతాబ్ధాల చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి న విషయాలను మనం గమనిస్తే మనకు ఎన్నో విశే షాలు తెలుస్తాయి. ముఖ్యంగా తానీషా ప్రభువల కా లం నుంచే ఇక్కడ కొలువుదీరిన అమ్మవారికి పూజ లు జరుగుతూ వచ్చాయి .అత్యంత ఘనచరిత్ర కలి గిన మహంకాళి అక్కన్న,మాదన్నల పేర్లతోనే ఆల యం సరిక్రొత్త చరిత్రను సృష్ఠించుకుంది.
ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే….. :
17వ శతాబ్దంలో గోల్కొండను పాలిస్తున్న తానీషా ఆస్థానంలో సైన్యాధ్యక్షుడిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అక్కన్న,మాదన్నలు ఎక్కువగా ఈ ఆలయంలో అమ్మవారిని కొలిచేవారు.భారతదేశ స్వాతంత్య్ర అనంతరం హైదరాబాద్ దక్కన్ భారత్‌లో 1948లో విలీనం అయ్యింది. అప్పటి నుంచి అక్కన్న,మాదన్న మహంకాళి ఆలయం అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి …. ఇప్పటి వరకు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూవస్తున్నారు.
ఈ ఆలయం అమ్మవారి విగ్రహాన్ని అంభారిపై ఊరేగించడం సామూహిక మాతేశ్వరి ఘాటల ఊరేగింపుకు ప్రత్యేక ఆకర్షణ. జంగయ్య ఈ ఆలయానికి చేసిన సేవలు కొనయాడలేమూ. ప్రస్తుతం ఆలయకమిటి ఛైర్మన్ జి.నిరంజన్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ తదితర ప్రముఖుల పర్యవేక్షణలో ఉత్సవాలు ప్రతిఏటా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మహంకాళి ఉత్సవాలకు సంబంధించిన ప్రతి అంశానికి కూడా ఎగ్జిబిషన్‌ను ఆలయం ఎదుట హాల్‌లో ఏర్పాటు చేయడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తే చాలు బోనాల చరిత్ర భక్తులకు అర్ధమవుతుంది.