అడవుల నుంచి జింకలు

 
మెదక్‌,జూలై 22 ( న్యూస్‌ పల్స్‌):విస్తారంగా వర్షాలు కురుస్తున్నా నేపథ్యంలో అడవుల నుండి జింకలు బయటకు వచ్చి చూపరులకు కనువిందు చేస్తున్నాయి..ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నారాయణఖేడ్‌ నియోజకవర్గం మనుర్‌ మండలం మైకోడ్‌ గ్రామ శివారులో సుమారు 100 కి పైగా జింకలు బయటకు వచ్చి గుంపులు,గుంపులుగా పచ్చిక బయిల విూద కనువిందు చేస్తున్నాయి.. వర్షాలు కురవడంతో పచ్చటి చెట్ల మధ్య జింకలు గుంపులు గుంపులుగా,చెంగు,చెంగు మంటూ గంతులు వేస్తున్నాయి..పక్కనే పంట పొలాల్లో పని చేస్తున్న రైతులు హుషారుగా తిరుగుతున్న జింకల గుంపులని తమ సెల్‌ ఫోన్లో చిత్రికరరించారు.చాలా రోజుల తర్వాత జింకలు ఇలా పచ్చిక బయళ్ల మధ్య చేస్తున్న విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....