అంబర్‌ పేట బోనాలపై మంత్రి తలసాని సవిూక్ష

హైదరాబాద్‌ జూన్,30,( ఇయ్యాల తెలంగాణ ):బోనాల సందర్భంగా అంబర్పేట్‌ మహంకాళి టెంపుల్‌ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలనీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వివిధ శాఖల అధికారులతో పేర్కొన్నారు.  ఆషాడ మాసం బోనాల పండుగ నిర్వహణ, ఏర్పాట్లపై అంబర్‌ పేట్‌ మహంకాళీ అమ్మ వారి ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అంబర్‌ పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, కార్పొరేటర్లు, ఆలయ కమిటీ కార్యవర్గం, పోలిస్‌ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

మహంకాళి టెంపుల్‌ తో పాటు నియోజకవర్గంలో ఉన్న అన్ని దేవాలయాలలో సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారి చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....