అంతర్‌ జిల్లా పోలీస్‌ తనిఖీ కేంద్రాల్లో రూ. 7,27 లక్షలు పట్టివేత

 జగిత్యాల అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ ): జగిత్యాల జిల్లా లోని మల్లాపూర్‌ మండలం ఓబులాపూర్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద ఎన్నికలల్లో తనిఖీలు భాగంగా పోలీసులు వాహనాలు తనిఖీలల్లో ఒక లక్ష 97 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.. అలాగే ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ లింగాపూర్‌ గ్రామ గండి హనుమాన్‌  ఆలయం వద్ద పోలీసులు తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కారులో 5 లక్షల 30 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు.. ఈ రెండు చెక్‌ పోస్ట్‌ తనిఖీలలో డబ్బులను సీజ్‌ చేసి సంబంధిత జిల్లా అధికారులకు 7,27 లక్షల రూపాయలు మొత్తం పంపినట్లు మెట్‌ పల్లి సీఐ లక్ష్మీ నారాయణ తెలిపారు.. ఈ తనిఖీల్లో నాయక్‌ తహసిల్దార్‌, ఫ్లయింగ్‌ స్కాడ్‌ ఎండి. ఖాదీర్‌ ,మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం ఎస్సైలు నవీన్‌ కుమార్‌, ఉమా సాగర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....