అంగ్లేయులకు ఎదురొడ్డి నిలిచిన దేశభక్తుడు Chandra Bose

గాంధీ భవన్‌ లోసుభాష్‌ చంద్రబోస్‌  జయంతి వేడుకల్లో 

జగిత్యాల మహిళా కాంగ్రెస్‌ నాయకురాళ్లు

జగిత్యాల, జనవరి 23 (ఇయ్యాల తెలంగాణ)  : సాయుధ పోరాటం తోనే స్వాతంత్య్రం సాధ్యమని నమ్మి ఆంగ్లేయులకు ఎదురొడ్డి నిలిచి దేశ భక్తిని చాటుకున్న గొప్ప వ్యక్తి సుభాష్‌ చంద్రబోస్‌ అని జగిత్యాల జిల్లా మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మిదేవేందర్‌ రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి ,బతికేపల్లి సర్పంచు తాటిపర్తి శోభారాణి లు అన్నారు.మంగళవారం హైదరాబాద్‌ గాంధీ భవన్‌ లో నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ జయంతి వేడుకలను జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల మహిళా కాంగ్రెస్‌ నాయకురాళ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా విజయలక్ష్మి, శోభారాణి లు మాట్లాడుతూ తను నమ్మిన సిద్ధాంతం కోసం పరితపించారని కొనియాడారు. భారతదేశాన్ని ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి కలిగించి, దేశానికి స్వాతంత్య్రం కోసం ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యపరిచడాని పేర్కొన్నారు.

 సుభాష్‌ చంద్రబోస్‌ వంటి దేశభక్తుడి ఆశయాలకోసం యువత ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గోపాల్‌ రావు పేట్‌ సర్పంచ్‌ ,  కరీంనగర్‌ జిల్లా మహిళా  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి , రాష్ట్ర

మహిళా  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....