రామాయంపేట సెప్టెంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ ):మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అంగన్వాడి ఉద్యోగులు హెల్పర్లు చేస్తున్న నిరవధిక సమ్మె నేటికీ 12 రోజులకు చేరుకుంది. అంగన్వాడి సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ మెంబర్ చౌదరి సుప్రభాత రావు మద్దతు తెలిపి ఆయన మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం వెంటనే అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కనీస వేతనం 26 వేలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే అంగన్వాడి సమస్యలు పరిష్కారం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు చౌదరి సుప్రభాతరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్ అంగన్వాడీ ఉద్యోగులు, హెల్పర్లు పాల్గొన్నారు.
- Homepage
- Telangana News
- అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ నాయకుల మద్దతు
అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ నాయకుల మద్దతు
Leave a Comment