అడుగడుగునా ప్రజాప్రస్థానం పాదయాత్రకు నీరాజనాలు
యాదాద్రి, మార్చి 18 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొనసాగిస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు అందిస్తున్నారు. 29వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో బాగంగా ఈరోజు యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలం బట్టుగూడ నుండి అనేక గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు 15 కీలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది రైతులు, నిరుద్యోగులు, మహిళలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైస్ షర్మిల. దారిలో అనేక మందిని ఓదార్చుతు వారికి ధైర్యానిచ్చారు. హోలీ పండుగ ఉన్నా అనేక ప్రాంతాలలో మహిళలు బ్రహ్మ రధం పట్టారు. హోళీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ 7ఏళ్ళ పాలనలో తెలంగాణ లోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య 1లక్ష 91వేలుఉండగా 81వేల పొస్టులు భర్తీ చేస్తామని అనడం కేసీఆర్ మరో మోసానికి తెర లేపుతున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన 5ఏళ్ళ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల్లో భర్తీ చేశారని, ప్రయివేటు రంగంలో 11లక్షల ఉద్యోగాలు స్రృష్టీంచారన్నారు. మరి కేసీఆర్ ఏన్ని ప్రయివేటు ఉద్యోగాలు స్రృష్టీంచారని ముఖ్య మంత్రి కేసీఆర్ కీ ప్రశ్నించారు. నేడు తెలంగాణ రాష్ట్రం లో 54 లక్షల నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారని, వారికి అవసరమైన ఉద్యోగాలు రాక బతకటానికి హామాలీలుగా, బర్లు గోర్ల కాపరులుగా, ఆటో డ్రైవర్లుగా, టిఫిన్ సెంటర్ లలో పని మనషులుగా మారారన్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక, తలిదండ్రులకు భారం కాకుండా అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది కేసీఆర్ కీ కనబడుత లేదా అని ప్రశ్నించారు. ఇందుకేనా తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నది అని అన్నారు. అదే విధంగా పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు రాక, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం కేసీఆర్ కాదా అని వైఎస్ షర్మిల అన్నారు. అనేక ప్రాజెక్టులపై కమీషన్ల పై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల, నిరుద్యోగుల ఆత్మహత్యలపై ద్రుష్టి సారించడంలో విఫలమైందని అన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు, మున్సిపల్ చార్జీలు పెంచకుండా గోప్ప పరిపాలన అందించారని కొనియాడారు. అందుకు విరుద్ధంగా కేసీఆర్ నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నారని, అన్నారు. కేసీఆర్ పాలనను ప్రజల తరపున ప్రశ్నించడానికే తెలంగాణ వైఎస్సార్ సీపీ పార్టీ పుట్టీందన్నారు. కేసీఆర్ పాలనకు చమరగీతం పాడుతామన్నారు. గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని కేసీఆర్ నమ్మిస్తాడని, కేసీఆర్ మోసానికి తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు. కార్యక్రమం లో వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్, ప్రచార కమిటీ కన్వీనర్ నీలం రమేష్, యాదాద్రి జిల్లా కోఆర్డినేటర్ మమ్మద్ అత్తార్, చైతన్య రెడ్డి, బి, సత్యవతి, నాగమణి, కల్పన, గాయత్రి, సుజాత, మంగీలాల్, గణేష్ నాయక్, లింగాచారి, బోర్గి సంజీవ, అమ్రృత సాగర్, రామలింగారెడ్డి, మాదిడీ విజయ బాస్కర్ రెడ్డి, చింతల అశోక్ రెడ్డి, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
