జులై7, (ఇయ్యాల తెలంగాణ ): భాకరాపేట, ఎస్ఆర్ పాళ్యం ప్రాంతాల్లో 15ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.డీఎస్పీ మురళీధర్ అధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ విష్ణువర్ధన్ కుమార్ టీమ్ తిరుపతి నుంచి బాకరాపేట అడవుల్లోని జిల్లెల మంద విూదుగా కూంబింగ్ చేపట్టారు.ఉస్తికాయలపెంట అటవీ పరిధిలోని మంగుమామిడి తోట వద్ద గురువారం కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు.వారిని సవిూపించి చుట్టుముట్టే లోపు వారు దుంగలను పడేసి పారిపోయారు.అక్కడ ఆరు ఎర్రచందనం దుంగలు లభించాయి.అదే విధంగా రాజంపేట నుంచి ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి టీమ్ ఎస్ఆర్ పాళ్యం సెక్షన్ లో కూంబింగ్ చేపట్టింది.రోళ్ల మడుగు వద్ద కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వారు టాస్క్ ఫోర్సు సిబ్బందిని గమనించి దుంగలు పడేసి పారిపోయారు.అక్కడకు చేరుకున్న సిబ్బందికి 9ఎర్రచందనం దుంగలు లభించాయి.మొత్తం 15దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషనుకు తీసుకుని వచ్చి కేసు నమోదు చేశారు.రెండు కేసులను సీఐ జీ శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు.