హైదరాబాద్, మార్చి 30, (ఇయ్యాల తెలంగాణ) :యాదాద్రి మహాదివ్యక్షేత్రంలో స్వయంభూ మూర్తుల దర్శనాలు పునఃప్రారంభమవడంతో భక్తుల రద్దీ పెరగనుంది. దీనికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు టీఎస్ఆర్టీసీ సమాయత్తమైంది. యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి జిల్లా కేంద్రం నుంచి గుట్టకు ఈ బస్సులు నడవనున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ సర్కిల్ నుంచి యాదగిరిగుట్టకు మినీ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడిరచారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి మూలవిరాట్ దర్శనాలు పునఃప్రారంభం కావడంతో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో ఆర్టీసీ మినీ బస్సులను ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్టకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సుల ఛార్జీలనూ ఆర్టీసీ వెల్లడిరచింది. జేబీఎస్ నుంచి 100 రూపాయలు, ఉప్పల్ నుండి 75 రూపాయలుగా ఛార్జీగా నిర్ణయించారు. ఇతర జిల్లాల నుంచి కూడా నారసింహుడి క్షేత్రానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.మరోవైపు.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనాలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఆరేళ్ల తర్వాత పునఃప్రారంభమైన యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ ఛైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని బస్సులను ఎర్పాటు చేస్తామని వెల్లడిరచారు. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలపై స్పందిస్తూ ఆర్టీసీ సెస్ ఛార్జీలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, సెస్ ఛార్జీలను ఛార్జీల పెంపుగా చూడకుడదని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఎస్ కు రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆనారోగ్యం ఇతర అవసరాల నేపథ్యంలో సిబ్బంది ముందుకు వచ్చి వీఆర్ఎస్ కు అప్లై చేశారని తెలిపారు. ఎవరినీ వీఆర్ఎస్ కోసం ఒత్తిడి చేయలేదన్నారు. వీఆర్ఎస్ సంఖ్య ఆధారంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి, వారికి వచ్చే సౌకర్యలను కల్పిస్తామని అన్నారు. వీఆర్ఎస్ పై పూర్తి క్లారిటి వచ్చిన తరువాతే ఆర్టీసీ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు