భాజపా కరోనా వారియర్స్ టీమ్ ఆదర్శనీయం: డా రావుల శ్రీధర్ రెడ్డి
హైదరాబాద్ ఇయ్యాల తెలంగాణ, మే 10 : భాజపా మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యేచన్ సురేష్ మరియు సీనియర్ నాయకుడు నేతృత్వంలో హైదరాబాద్ కరోనా వారియర్స్ టీమ్ సనత్ నిర్వహిస్తున్న”ఫీడ్ ది నీడి” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 45 వ రోజుకు చేరుకోవడంతో ఒడిశా మరియు బీహార్ రాష్ట్రాలనుండి వలస వచ్చి సనత్ నగర్ ప్రాంతంలో ప్లంబింగ్ సేవలు అందిస్తున్న శ్రామికులకు మరియు పాలమూరు, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలనుండి వలస వచ్చి గృహావసరాలకు మరియు హౌస్ కీపర్స్ గా సేవలందిస్తూ కరోనా వైరస్ నేపథ్యంలో “లాక్ డౌన్” వల్ల ఇబ్బందికి గురవుతున్నవారిలో ప్రత్యేకంగా 45 కుటుంబాలను ఎంపిక చేసినప్పటికీ అదనంగా మరో 25 కుటుంబాలను కూడా కలిపి మొత్తం 70 కుటుంబాలకు సనత్ నగర్ బస్సు స్టాండ్ సమీపంలో ఎస్ ఆర్ టి 167 ఎదురుగా గల వీర్ సావర్కర్ పార్క్ లో పక్షం రోజులకు సరిపడ 18 రకాల నిత్యావసర సరుకులు, శానిటైజర్ లు, మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది.
నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భాజపా హైదరాబాద్ అధికార ప్రతినిథి డా రావుల శ్రీధర్ రెడ్డి, ఆత్మీయ అతిథులు వై మోహన్ ముదిరాజ్, శ్రీమతి పి నాగమణి, వీర్ సావర్కర్ పార్క్ గ్రౌండ్ సభ్యులు ఎం విష్ణుమూర్తి, బి హనుమంతరావు, సతీష్ కుమార్, బి సురేష్, ఏ ఎన్ సతీష్ కుమార్, రజనీష్ కుమార్ (బంటీ), విక్రమ్, విశాల్, ఆనంద్ లతో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. యేచన్ సురేష్ మాట్లాడుతూ తమ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మరియు నగర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్ రావు ల ఆదేశాలను పాటిస్తూ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి దిశానిర్దేశంతో నేటి వరకు 45 రోజులుగా నిరంతరాయంగా “ఫీడ్ ది నీడి” కార్యక్రమం నిర్వహించడానికి తమ సహకారాన్నందిస్తున్న ప్రతి పార్టీ కార్యకర్తకు, ఆర్ధిక సహాయానందిస్తున్న దాతలకు తాను సర్వదా కృతజ్ఞుడినని తెలిపారు.
కార్యక్రమ ముఖ్య అతిథి డా. శ్రీధర్ రెడ్డి, ఆత్మీయ అతిథులు వై మోహన్, కుందనం మోహన్ లు మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని నిత్యావసర సరుకులతో పాటు మాతృమూర్తులను గౌరవించి సత్కరించడం భారతీయ సంస్కృతికి అద్దంపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి భాజపా యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్, దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాళ్ళ జైహింద్ గౌడ్, విట్టల్ మురళి, లక్ష్మణ్ పటేల్, బోలేనాథ్, శంకర్, విజయ్, కాసాని శివప్రసాద్ గౌడ్, సరిత శ్రీనివాస్ గౌడ్, అరుణ్ గౌడ్, గోలి వెంకటపతి, మిథుల్ రాజ్, ఫణిమాల, దీపక్, కార్తీక్ వారణాసి, కిషోర్, ధర్మేంద్ర, భాను, సన్నీ రాజ్, లలన్ భాయి, భరత్, విజయ్ బిడ్లన్, జె కె ఠాకూర్, ఢోలక్ సత్యనారాయణ కుమారుడు రాజు తదితరులు సహకారం అందించారు. పెరుమాళ్ళ నాగమణి మాస్కులు అందచేశారు.