ముంబై, జూలూ 8, (ఇయ్యాల తెలంగాణ) : ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడు ఇండియాలోనే ఉన్నాడని విూకు తెలుసా? ముంబైలో 2 బీహెచ్?కే ఫ్లాట్? అతని సొంతం. అతని ఆస్తి విలువ ఎంతంటే..: ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఎవరంటే.. ముందుగా గుర్తొచ్చే పేర్లు ఎలాన్? మస్క్?, జెఫ్? బెజోజ్?. అదే ఇండియా విషయానికొస్తే.. ముకేశ్? అంబానీ, గౌతమ్? అదానీ. ఇవన్నీ కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ‘బిచ్చగాడు’ ఎవరో విూకు తెలుసా? వీధుల్లో అడుక్కుంటూ జీవితం గడిపేవారు సంపన్నులు ఎలా అవుతారు? అని విూరు ఆలోచిస్తే.. పొరబడినట్టే! ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన బిచ్చగాడు.. ఇండియాలోనే ఉన్నాడు.
అతని పేరు భారత్? జైన్?. అతని ఆస్తుల విలువ తెలిస్తే షాక్? అవ్వాల్సిందే..ఎకనామిక్? టైమ్స్? నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన బెగ్గర్?.. భారత్? జైన్?. ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించే ఈ జైన్? నెట్? వర్త్? దాదాపు రూ. 7.5కోట్లు! భిక్షాటన నుంచే అతనికి నెలకు రూ. 60వేల నుంచి రూ. 75వేల వరకు వస్తుంది. అంతేకాకుండా.. ముంబైలో రూ. 1.2కోట్లు విలువ చేసే ఓ 2బీహెచ్?కే ఫ్లాట్? కూడా భారత్? జైన్? సొంతం! థానే ప్రాంతంలో రెండు దుకాణాలు కూడా అతనికి ఉన్నాయి. వాటి నుంచి జైన్?కు నెలకు రూ. 30వేల వరకు రెంట్? వస్తుంది.ఛత్రపతి శివాజి మహరాజ్? రైల్వే స్టేషన్?, అజాద్? మైదాన్? ప్రాంతంలో భిక్షాటన చేస్తుంటాడు భారత్? జైన్?. తన వెనుక ఎంత ఆస్తి ఉన్నా.. ఇప్పటికీ భిక్షాటన చేస్తూనే ఉన్నాడు. రోజంతా ఎంత కష్టపడినా.. చాలా మందికి వందల్లోనే జీతం ఉంటోంది. అలాంటిది.. భారత్? జైన్? రోజుకు రూ.2వేల నుంచి రూ. 2,500 వరకు సంపాదిస్తున్నాడు.
ముంబై పరేల్? ప్రాంతంలోని ఓ 1 బీహెచ్?కేలో జైన్? తన కుటుంబంతో నివాసముంటున్నాడు జైన్?. అతని పిల్లలు కాన్వెంట్? స్కూల్?కు వెళ్లి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇతర కుటుంబసభ్యులు కిరాణా దుకాణాల్లో పని చేస్తుంటారు. భిక్షాటన మానుకోవాలని భారత్? జైన్?కు వాళ్లందరు సూచిస్తుంటారు. కానీ అతను మాత్రం? ‘అస్సలు వదలను’ అనే చెబుతుంటాడు!