పురానాపూల్ ప్రాంతంలోని స్వామి వివేకనందనగర్లో కొలుదీరిన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం అత్యంత ప్రాచీనమైన అమ్మవారి దేవాలయాల్లో ఒకటి. ప్రస్తుతం ఛైర్మన్ ఎం.కిషన్,అధ్యక్షుడు పి.నాగేష్ సారధ్యంలో బోనాల జాతర గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత వైభవంగా కొనసాగిస్తున్నారు.ఇక్కడ జరిగే బోనాల పండుగ ఉత్సవాలకు స్థానిక బస్తీవాసులే కాకుండా అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడ కొలువదీరియున్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి కృపను పొందుతారు. ముఖ్యంగా ఆలయ చైర్మెన్ కిషన్ ఇక్కడ నిర్వహించే బోనాల జాతరలో ప్రతిఏటా ఏదో కొత్త దనాన్ని భక్తులకు పరిచయం చేస్తారు.ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయని అందరి నోటా నానుడి మాట. అందుకే ఈ ప్రాంతంలోని బోనాలకు అంతటి ప్రాచుర్యం లభించింది.
ఇక ఈ ఆలయ చరిత్రను గురించి మనం తెలుసుకోవాలంటే ……….
1956 వ సంవత్సరములో కిన్నెర గురువయ్య,గాదె ఎల్లయ్య, గుర్రి రామయ్య, వడ్డెపాక ముత్తయ్య,పంగ గండయ్య,ఎల్.దయానంద్, దేశపాక పాపయ్య,లంద దయానంద్,బాకారం కిష్టయ్య,మొగులయ్య అనే కొందరు పెద్ద మనుష్యలు ఈ ప్రాంతంలో నివాసముంటున్న జనా లకు కలరా లాంటి వ్యాధులు రావడంతో కనకదుర్గ ఆల యాన్ని స్థాపిం చడం జరిగింది.తరువాత కలరా వ్యాధి తగ్గడంతో ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని నాటి నుంచి నేటి వరకు భక్తులు,స్థానిక బస్తీవాసులు నిత్యపూజలు కొనసాగిస్తూ వస్తున్నారు.ఈ ప్రాంతానికి అప్పట్లో యాద్ గార్ హుస్సేన్ కుంట అనే పేరు ప్రసిద్ది గాంచింది. తరువాత పురానాపూల్ కనకదుర్గా ఆలయానికి 1990 వసంవత్స రంలో పునర్నిర్మాణ పనులను చేపట్టారు.ఈ నిర్మాణానికి ప్రస్తుత ఆలయ కమిటి చైర్మెన్ ఎమ్.కిషన్ అహర్నిషలు పాటుపడి ఆలయ అభివృద్దికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పటికీ రోజు రోజుకి అత్యంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న కనకదుర్గ ఆలయంలో నాటి నుంచి నేటి వరకు కిషన్ ఆధ్వర్యంలో అత్యంత కన్నుల పండుగగా ఉత్సవాలు ఎంతో గొప్పగా కొనసాగుతున్నాయి.