నిరుపేదలకు 500 నిత్యావసరాల ఆహార కిట్లు పంపిణీ
![]() |
పేద ప్రజలకు నిత్యావసరాల కిట్లను అందజేస్తున్న శాసన సభ్యులు మహమ్మద్ మోజం ఖాన్ |
హైదరాబాద్ మే 15 ఇయ్యాల తెలంగాణ
పేద ప్రజలు లాక్ డౌన్ కారణంగా పస్తులు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని బహదూర్ పూరా శాసన సభ్యులు మహమ్మద్ మోజం ఖాన్ అభివర్ణించారు. ఎం ఐ ఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి ఆదేశానుసారం ఈ రోజు ఎమ్మెల్ల్యే మోజం ఖాన్ బహదూర్ పుర నియోజక వర్గం పరిధి లోని నజం నగర్ వాహాబ్ ఫంక్షన్ హాల్ కిషన్ బాగ్ తదితర ప్రాంతాల్లో సుమారు 500 నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. ఆయన వెంట ఆయా డివిజన్ ల పరిధి లోని మహమ్మద్ సలీం తో పాటు పలువురు ఎం ఐ ఎం నాయకులు పాల్గొన్నారు