వర్షంలోనూ క్యూలైన్లో రైతు నిలు చున్నారు. వికారబాద్ జిల్లాలో ఓ మోస్తరు వర్షం పడింది. అన్ని మండలాల్లో తెల్లవారుజామున చిరుజల్లుల తో కూడిన వర్షం కురువగా, సాయంత్రం కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటికే దుక్కి దున్ని విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ మోస్తరు వర్షం మాత్రమే కురియడంతో కాబట్టి ఇప్పుడే ఎవరూ విత్తనాలను నాటోద్దని జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా 60 నుంచి 70 మి.విూటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తనాలను నాటితే నాటిన ప్రతీ విత్తనం మొలకెత్తే అవకాశముంటుందంటున్నారు. మరోవైపు జిల్లాలో వానకాలం సీజన్లో 4.80 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అదేవిధంగా జిల్లాలో సరిపోను ఎరువు, విత్తనాలను కూడా అందుబాటులో ఉంచారు. మరో ఒకట్రెండు మంచి వానలు కురిసిన అనంతరమే విత్తనాలను నాటాలన్నారు. ఒకవేళ ఇప్పుడే విత్తనాలను నాటితే విత్తనాలు మొలకెత్తవని, మళ్లీ విత్తనాలను నాటాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రైతులందరూ పత్తి, కంది పంటలను సాగు చేయాలన్నారు. వానకాలం సీజన్లో సాగు చేసే పంటలకు సరిపడా ఎరువు, విత్తనాలను జిల్లాలో అందుబాటులో ఉంచామని వ్యవసాయాధికారి గోపాల్ వెల్లడించారు.
వర్షంతో హైదరాబాద్‌లోనూ చల్లబడ్డ వాతావరణం
హైదరాబాద్,జూన్11(ఇయ్యాల తెలంగాణ): తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. వాస్తవానికి గత రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ముసురు కురు స్తున్నది. అల్ప పీడన ప్రభావంతో మంగళవారం రాత్రి మొదలైన వానలు బుధవారం సాయంత్రం దాకా కురిసింది. భద్రాద్రి జిల్లాలో ఎగువన కురిసన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వాగులు పొంగుతున్నాయి. కిన్నెరసాని, మల్లన్నవాగులు, ఏడు మెలికవాగులకు వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో గుండాల నుంచి మణుగూరు, నర్సంపేట, వరంగల్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో గత రాత్రి కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సాధారణం కంటే రెట్టింపుగా వర్షపాతం నమోదు అయ్యింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సారి అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదు అవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో జూన్ 1 నుండి 11 వరకు సాధారణ వర్షపాతం 37 మిల్లీవిూటర్లు కాగా, అధికంగా 79 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మెదక్ జిల్లాలో సాధారణ వర్షాపాతం 42.7 మిల్లీవిూటర్లు కాగా, 88.9 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సిద్ధిపేట జిల్లాలో సాధారణ వర్షపాతం 23.6 మిల్లీవిూటర్లు కాగా… అత్యధికంగా 66.6 మిల్లి విూటర్ల మేర వర్షపాతం నమోదు అయ్యింది. నిర్మల్ జిల్లాలోని ముధోల్‌లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ముధోల్ మండంలో రాయితీ సొయా విత్తనాలు పంపిణీ కావడంతో వ్యవసాయ కార్యాయం వద్ద టోకెన్ల కోసం రైతు బాయి తీరారు.