హైదరాబాద్, జూన్ 3 (ఇయ్యాల తెలంగాణ) : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోన బారి నుంచి త్వరగా కోలుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేస్ నాయకులు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క,ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్,మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఇతర ముఖ్య నాయకులు ఈ రోజు ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. దేశ వ్యాప్తంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుతూ ప్రతి ఒక్కరూ ఆలయాలు,మసీదులు, చర్చిల్లో ప్రత్యక పూజలు జరుపుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ రోజు ఇక్కడ భాగ్యలక్ష్మీ చెంత తమ అధిష్టాన నాయకురాలు త్వరగా కోలుకోవాలని మేమంతా పూజలు జరుపుతున్నామని అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. ఆలయంలో కాంగ్రెస్ నాయకులకు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ ట్రస్టీ శశికళ ప్రత్యేక పూజ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు ఆలయ సాంప్రదాయ పద్దతిలో స్వాగతం పలకడంతో పాటు శాలువాలతో నాయకులను సన్మానించారు.