హైదరాబాద్, జూన్ 24, (ఇయ్యాల తెలంగాణ):
తెలంగాణ రాష్ట్రంలో జులై 1న గ్రూప్`4 పోస్టులకు రాతపరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సారి గ్రూప్ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ టీఎస్పీఎస్సీ ప్రకటన వెలువరించింది. దీని ప్రకారంగా పేపర్`1, పేపర్`2 పరీక్షలకు అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తరువాతే ఓఎంఆర్ పత్రాల్ని అందజేయనున్నారు. గ్రూప్ 1 పరీక్షకు బయోమెట్రిక్ తీసుకోకుండా పరీక్ష నిర్వహించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్ 4 పరీక్షలకు బయోమెట్రిక్ తప్పరిసరి చేసింది. ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 8,180 గ్రూప్`4 పోస్టులకుగానూ 9.51 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. భారీ సంఖ్యలో ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తుండటంతో జిల్లాకేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టీఎస్పీయస్సీ సమావేశాలు నిర్వహించింది. రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు