హైదరాబాద్, జూన్ 28, (ఇయ్యాల తెలంగాణ ): 2022`23 ఆర్థిక సంవత్సరం/2023`24 మదింపు సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌లు ఫైల్ చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది. జీతం పొందే పన్ను చెల్లింపుదార్లలోఎక్కువ మంది తమ కంపెనీల నుంచి ఈ నెల (జూన్ 2023) 15 నాటికి ఫామ్`16 అందుకున్నారు. దీంతో, జూన్ 15 తర్వాతి నుంచి ఇన్‌కం టాక్స్ రిటర్న్ ఫైలింగ్ నంబర్లలో వేగం పెరిగింది. 2022`23 ఆర్థిక సంవత్సరం/2023`24 అసెస్మెంట్ సంవత్సరానికి, 26 జూన్ 2023 వరకు, కోటి మంది పన్ను చెల్లింపుదార్లు ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసినట్లు ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ ట్వీట్ చేసింది. చివరి తేదీ వరకు ఆగకుండా ముందుగానే ఐటీఆర్ ఫైల్ చేయడంపై టాక్స్ పేయర్లను అభినందించింది. గత అసెస్మెంట్ ఇయర్ 2022`23లో, 8 జులై 2023 నాటికి కోటి మంది పన్ను చెల్లింపుదార్లు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 12 రోజుల ముందుగానే ఆ మైలురాయిని సాధించినట్లు ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.టాక్స్ పేయర్లు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆదాయపు పన్ను పత్రాలను సులభంగా దాఖలు చేయడం తమ ప్రాధాన్యతల్లో ఒకటి ఆదాయ పన్ను విభాగం హావిూ ఇచ్చింది. చివరి క్షణంలో రిటర్న్ దాఖలు చేసేందుకు హడావిడి పడకుండా, ఇదే ఊపును కొనసాగించాలని, ఐటీఆర్
త్వరగా ఫైల్ చేయాలని టాక్స్ పేయర్లకు ఆదాయపు పన్ను విభాగం విజ్ఞప్తి చేసింది.2023`24 అసెస్మెంట్ సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జులై 2023. రిటర్న్‌లు సమర్పించే ఇండివిడ్యువల్ టాక్స్ పేయర్లలో ఎక్కువ మంది ఐటీఆర్ `1 ఫామ్ ద్వారా ఆదాయాన్ని ప్రకటిస్తారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్ల వార్షిక ఆదాయం రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉండిÑ జీతం, ఒక ఇంటి ఆస్తి, బ్యాంకు నుంచి వడ్డీ, డివిడెండ్, వార్షిక వ్యవసాయ ఆదాయం రూ. 5000 దాటకుండా ఉంటే.. అటువంటి పన్ను చెల్లింపుదార్లు ఐటీఆర్ `1 ఫామ్ ద్వారా ఆదాయాన్ని ప్రకటించాలి.ఈ నెల 30తో పాన్`ఆధార్ అనుసంధానం గడువు ముగుస్తుంది. ఈ రెండిరటిని లింక్ చేయకపోతే ఎు రిటర్న్ సమర్పించడం సాధ్యం కాదు. కేవలం రూ. 1,000 జరిమానా చెల్లించి, ఈ నెల 30లోగా పాన్`ఆధార్‌ను లింక్ చేయవచ్చు. కేవలం అని ఎందుకు చెప్పామంటే, జూన్ 30 తర్వాత రూ. 10 వేలు ఫైన్ కట్టాల్సిరావచ్చు. పాన్`ఆధార్ లింక్ కాకపోతే, పాన్ కార్డ్ నాన్`ఆపరేటివ్‌గా మారుతుంది. పన్ను చెల్లింపుదార్లకు రిఫండ్ రాదు. పాన్ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు. అలాగే, అలాంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ టీడీఎస్ డ టీసీఎస్ వసూలు చేస్తారు.రెండు రోజులే ఆధార్ లింక్ కు టైమ్హైదరాబాద్, జూన్ 28, (న్యూస్ పల్స్) విూరు విూ ఇన్‌కం టాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేయాలంటే, ముందుగా విూ ఆధార్ కార్డ్‌ను ` పాన్ కార్డ్‌ను కచ్చితంగా లింక్ చేయాలి. ఈ రెండిరటికీ జత కుదర్చకపోతే ఐటీఆర్ ఫైల్ చేయలేరు. ఒకవేళ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు టాక్స్ డిపార్ట్మెంట్ అనుమతించినా, కొన్ని టాక్స్ బెనిఫిట్స్‌ను మాత్రం మిస్ అవ్వాల్సి వస్తుంది.విూ ఆధార్ కార్డ్‌ను ` పాన్ కార్డ్‌ను లింక్ చేయడానికి ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. వాస్తవానికి, పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించడానికి పాన్`ఆధార్ నంబర్ అనుసంధానం డెడ్‌లైన్‌ను అఃఆు గతంలోనే పెంచింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పుడు ఆ లాస్ట్‌డేట్ కూడా ముగింపునకు వచ్చింది. జూన్ 30 లోగా పాన్`ఆధార్ లింక్ పూర్తి చేయడానికి రూ. 1,000 జరిమానా కడితే సరిపోతుంది. ఆ తర్వాత, ఇదే పని కోసం రూ. 10 వేలు ఫైన్ కట్టాల్సిరావచ్చని సమాచారం. 30 జూన్ 2023లోపు పాన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయకపోతే, సదరు వ్యక్తి పాన్ కార్డ్ నాన్`ఆపరేటివ్‌గా మారుతుంది. ఆ తర్వాత అధిక జరిమానా ఎదుర్కోవలసి వస్తుంది. పాన్`ఆధార్ లింక్ కాకపోతే, టాక్స్ పేయర్‌కు రిఫండ్ రాదు. పాన్ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు. అలాగే, అలాంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ టీడీఎస్ డ టీసీఎస్ వసూలు చేస్తారు. అంతేకాదు, పాన్ కార్డ్`ఆధార్ అనుసంధానం కాకపోతే ఆర్థికపరమైన లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంక్ అకౌంట్, డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. పాన్ కార్డ్ అవసరమైన ప్రతి చోట పని ఆగిపోతుంది. పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసి, ఫైన్ కట్టిన తర్వాత 30 రోజుల్లో పాన్ మళ్లీ క్రియాశీలంగా మారుతుంది.పాన్`ఆధార్ లింక్ నుంచి మినహాయింపు పొందిన వ్యక్తులు, వాటిని అనుసంధానించాల్సిన అవసరం లేదు. నిర్దిష్ట రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు, చట్టం ప్రకారం నాన్ రెసిడెంట్లు, భారతీయ పౌరులు కాని వాళ్లు, గత సంవత్సరం నాటికి 80 ఏళ్లు పైబడిన వాళ్లు మినహాయింపు వర్గంలోకి వస్తారు.ఆధార్`పాన్‌ను ఎలా లింక్ చేయాలి?ఆదాయపు పన్ను ఈ`ఫైలింగ్ పోర్టల్ ను ఓపెన్ చేయండి.ఈ వెబ్సైట్లో (ఇప్పటికీ చేయకపోతే) రిజిస్టర్ చేయసుకోండి.విూ పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) విూ యూజర్ ఎఆ అవుతుంది.యూజర్ ఎఆ, పాస్వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.ఇప్పుడు, విూ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి పాప్`అప్ విండో ఓపెన్ అవుతుంది.పాప్ అప్ విండో తెరుచుకోకపోతే, మెనూ బార్‌లోని ‘ప్రొఫైల్ సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘లింక్ ఆధార్’పై క్లిక్ చేయండి.పాన్ కార్డ్‌లో ఉన్న ప్రకారం విూ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు అక్కడ కనిపిస్తాయి.విూ ఆధార్, పాన్ కార్డ్ వివరాలను సరిచూసుకోండి.వివరాలు సరిపోలితే, విూ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, ‘‘లింక్ నౌ’’ బటన్‌పై క్లిక్ చేయండి.విూ ఆధార్ విూ పాన్‌తో విజయవంతంగా లింక్ అయిందన్న పాప్`అప్ మెసేజ్ విూకు తెలియజేస్తుంది.