ఒక్కరోజు … 48 గంటలు ‘‘
ఇందిరా ఆర్ట్ క్రియేషన్స్ వంశీ రాజు సమర్పించు ప్రీతి క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘‘ ఒక్కరోజు … 48 గంటలు ‘‘ ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది అని ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదిత్య ,రేఖ నిరోషా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిరంజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్కరోజు సినిమా ట్రైలర్ లాంచ్ త్వరలో సి కళ్యాణ్ గారి చేతులవిూదుగా జరుగుతుందని, జులై లోనే ఈ చిత్రం విడుదల అవుతుంది అని తెలిపారు.డైమండ్ ని రక్షించటానికి హీరో టైం ట్రావెలింగ్ ని వాడుకొని ఎలా విజయం సాధించాడు అనేది సినిమా అని ప్రొడ్యూసర్ కిరణ్ రెడ్డి , డైరెక్టర్ నిరంజన్ తెలిపారు.
సమర్పణ : వంశీ రాజు, హీరో : ఆదిత్య బద్వేల హీరోయిన్ : రేఖ నిరోషా