హైదరాబాద్, సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ) : ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ జిల్లాలోని ప్రతి ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఇన్ స్పైర్ అవార్డులకై 5 నామినేషన్లను వెంటనే వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్ . రోహిణీ సూచించారు. ఈ మేరకు సోమవారం సుజాత హైస్కూల్ నాంపల్లి మండలం లో ఇన్స్పైర్ అవార్డుల నామినేషన్ల నమోదు ప్రక్రియపై గైడ్ టీచర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం లో పెద్ద ఎత్తున రెండువందల యాభై పైగా కార్యక్రమానికి రావడం జరిగింది.
ఈ కార్యక్రమానికి హిమాయత్ నగర్ మండలం విద్యాశాఖాధికారిని విజయలక్ష్మి మాట్లాడుతూ నామినేషన్లను సకాలంలో పూర్తి చేసి విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సీ ధర్మేంద్ర రావు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో అవార్డులకు ఎంపికైన విద్యార్థుల బ్యాంకు ఖాతాలో 10 వేల రూపాయలు నేరుగా కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ జమ చేస్తుందని తెలిపారు. ఫరానా బేగం స్టెమ్ ప్రోగ్రామ్ మేనేజర్ మేనేజర్ మరియు తిరుపతిరెడ్డి సైన్స్ టీచర్ డాన్ లవ్ బర్డ్స్ హైస్కూల్ కలిసి నామినేషన్ ప్రక్రియ ప్రాజెక్టు ద్వారా అవగాహన కల్పించడం జరిగిన జరిగినది.