హైదరాబాద్, మార్చి 7 (ఇయ్యాల తెలంగాణ) : ప్రయివేటీకరణపై మేధావుల మధన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు జి. మురళీధర్ రావు పాల్గొని ప్రసంగించారు. ప్రయివేటీకరణ అత్యంత ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మాసాబ్ ట్యాంక్ లోని వేడ్స్ గార్డెన్ లో ప్రయివేటీకరణ పై మేధావుల మధన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమం ముందుగా వనమల శివచరణ్, ఎం. నగేష్ లు ఆలపించిన బుద్ద వందనంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన జీ మురళీధర్ రావు మాట్లాడుతూ దేశంలో ఎస్సీ ఎస్టీలను అనగదోక్కడానికే కేంద్రం ప్రయివేటీకరణ వైపు నిశ్శబ్దపు అడుగులు వేస్తుందని అన్నారు. కొన్ని నెలలుగా అనేక పబ్లిక్ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లోనే ఉద్యోగాలు కల్పిస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పై కుట్రలు చేస్తున్నారనే దానికి ఇది నిదర్శనమని అన్నారు.
ప్రత్యన్మయం లేని ప్రయివేటీకరణ అవసరమా అని మురళీధర్ రావు కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు. ఇది ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హేచ్చరించారు. అనంతరం మరో ముఖ్య అతిథి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గోళ్ళ రమేశ్ మాట్లాడుతూ, ప్రతి పబ్లిక్ రంగ సంస్థ లలో దళిత గిరిజన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. దేశంలోని 138 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో కేవలం రెండున్నర శాతం మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్నారు. దేశంలోని భూములు పరిశ్రమలను కేంద్రం తమ ఆధీనంలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ప్రయివేటీకరణ కు సిద్దం అవ్వడం వలన రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ లకు ఉద్యోగ భద్రత, రిజర్వేషన్లు లేకుండా చేయాలని ద్రృష్టీ సారిస్తున్నారన్నారు. ఎదీ ఎమైన ఒక కార్యాచరణ తో ప్రయివేటీకరణ పై వ్యతిరేక పోరాటానికి సీద్దమవ్వాలని అన్నారు.
అనంతరం ఆల్ ఇండియా రేడియో రిటైడ్ అధికారి ఆశయ్య మాట్లాడుతూ, ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జీ మురళీధర్ రావు కి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. మనువాద సంస్క్రుతిని మళ్లీ ఈ దేశంలో కొనసాగించాలనే కుట్రలో బాగమే ఈ ప్రయివేటీకరణ అని అన్నారు. దళితుల్లో ఐక్యత లోపీంచడం వల్లనే కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని అన్నారు. అనంతరం ఆదిలాబాద్ సుశీలమ్మ మాట్లాడుతూ, సమస్యలపై పోరాటం చేస్తేనే పరిష్కారం లభిస్తుందని అన్నారు. మురళీధర్‌రావు లాంటీ నిస్వార్థపు సేవకుడు ఈ దేశంలోనే లేరన్నారు. అలాంటి వ్యక్తి ఏ కార్యం తలపెట్టినా తన వంతు సహకారం అందిస్తామని అన్నారు. సమావేశానికి హాజరు అయిన వారికి అన్న ధాతలైన ఎం నగేష్, జి. సూర్యనారాయణ మూర్తి లకు అధ్యక్షుడు మురళీధర్ రావు సభా ముఖంగా మెమంటోలు ఇచ్చి అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన వారిలో పి. యాదగిరి, కీమా నాయక్, రాసూరి చంద్రశేఖర్, ఎ. శివరాజ్, మంచిర్యాల రాజ సమ్మయ్య, సత్యలింగం, అడ్వకేట్ మానిక్ రావ్, సోమరాజు, అడ్వకేట్ రాజు, రాసూరి శంకర్, చేన్న కేశవులు, బి ఆర్ సోమన్న ఎపి కన్వీనర్ ,అడ్వకేట్ ఇ. వినోద్, ఉపేంధర్, డాక్టర్ ప్రభాకర్, జర్నలిస్టు నరహారి, సింగరేణి వేంకటేశ్వర్లు సంస్థ స్పోర్ట్స్ ఇన్చార్జ్ సురేష్, మంచిర్యాల రాజమల్లయ్య, జూబ్లీహీల్స్ వేంకటయ్య, నాగరాజు, రాజేంద్రప్రసాద్, సంస్థ కార్యదర్శి నారాయణ ఇసిఐఎల్ మురహారి, వినోద్ కుమార్,పులి పాండు తదితరులు పాల్గొన్నారు.
