
యాదాద్రి, జూన్ 20, (ఇయ్యాల తెలంగాణ) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శించుకునే భక్తులకు శుక్రవారం నుంచి హారతితో పాటు జలసంప్రోక్షణ నిర్వహించనున్నట్లు ఈవో వెంకట్రావు వెల్లడిరచారు. గురువారం ఆలయ అర్చకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించే నిబంధన కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు, పర్వదినాల్లో వీఐపీల ద్వారా వచ్చే సిఫార్సు లేఖలను అనుమతించబోమని, మిగతా రోజుల్లో మాత్రం తిరుపతి దేవస్థానం తరహాలో ప్రతి ఒక్కరికి టికెట్ ద్వారానే దర్శనం కల్పిస్తామని తెలిపారు.