Y V.సుబ్బారెడ్డి సేవలు అనుసరణీయం`

తిరుమల ఆగష్టు 8 (ఇయ్యాల తెలంగాణ): టీటీడీ ఛైర్మన్‌గా  వైవి.సుబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు అందించిన సేవలు అనుసరణీయమని తిరుపతి శాసనసభ్యులు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు  భూమన కరుణాకర్‌రెడ్డి కొనియాడారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా  భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ  వైవి.సుబ్బారెడ్డి తన పదవీకాలంలో సామాన్య భక్తులకు మెరుగైన వసతులు కల్పించడానికి, దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. వివాదరహితుడు, సౌమ్యుడు అయిన  వైవి.సుబ్బారెడ్డి నుంచి తాము చాలా నేర్చుకున్నామని చెప్పారు. బోర్డు సభ్యులంతా  వైవి.సుబ్బారెడ్డి సేవలను కొనియాడారు. అనంతరం  భూమన శాలువతో సుబ్బారెడ్డిని సన్మానించారు.

తిరుపతి శాసనసభ్యులు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు  భూమన కరుణాకర్‌రెడ్డి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....