
హైదరాబాద్, జూన్ 28 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణకు సంబంధించిన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 38,741 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా.. అందులో 24,415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ పరీక్షలను జూన్ 2 నుంచి 13 వ తేదీ వరకూ నిర్వహించారు. తెలగాణలో ఈ ఏడాది మొత్తం 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల కోసం..http://bse.telangana.gov.in. అధికారిక వెబ్సైట్ను సందర్శించి, డౌన్లోడ్ చేసుకోవచ్చు