‘వార్‌ 2’ కోసం డబ్బింగ్‌ ప్రారంభించిన NTR

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంతో యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్‌ 2’. ఈ మూవీని ఆగస్ట్‌ 14న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతోన్నారు. ఇక ఈ ఏడాదిలో అందరూ ఎదురుచూస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ ప్రాజెక్ట్‌ల్లో ‘వార్‌ 2’ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ భారీ పాన్‌`ఇండియా యాక్షన్‌ దృశ్యాన్ని చూసేందుకు మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా రిలీజ్‌ చేసిన ‘వార్‌ 2’ టీజర్‌ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ టీజర్‌ ఒక్కసారిగా సినిమా విూద అంచనాల్ని పెంచేసింది. ఇక తాజాగా వార్‌ 2 డబ్బింగ్‌ పనుల్ని షురూ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఈ మూవీ కోసం డబ్బింగ్‌ చెప్పేస్తున్నారు. ఈ మేరకు రిలీజ్‌ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ  ‘వార్‌ 2’  జఖీఈ స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో ఆరవ భాగంగా రాబోతోంది. ‘వార్‌ 2’లో హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌, కియారా అద్వానీలు ప్రధాన పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో అడ్రినలిన్‌`పంపింగ్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇవ్వబోతోన్నారు. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....