హుస్నాబాద్, ఫిబ్రవరి 11 (ఇయ్యాల తెలంగాణ) : హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ లో ఓటు అనేది ఆయుధం. ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. గ్రావిÖణ ప్రాంతాల్లో 90 శాతం ఓటర్లు ఓటు వేస్తున్నారు అర్బన్ ప్రాంతాల్లో అవగాహన తక్కువ ఉంది. 116 మున్సిపాలిటీ లు ,7 కార్పొరేషన్ లలో ప్రతి అర్బన్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్న. గ్రావిÖణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల అభివద్ధికి పట్టణ ఓటర్లు తమ విచక్షణ తో ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజా ప్రతినిధి నీ ఎక్కుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న. ఓటు వేయకుంటే గ్రావిÖణ ప్రాంతాల్లో జీవించి ఉన్నట్లు కాదని నానుడి చెప్తారు. అర్బన్ లో అనేక పనులు ఉన్నప్పటికీ వెసులుబాటు చేసుకొని తమ ఓటు వినియోగించుకోవాలి అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోండి ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు.
