విద్యుత్ తీగలకు మరమ్మత్తులు చేయండి :

హైదరాబాద్, ఆగస్టు 25, (ఇయ్యాల తెలంగాణ) : సేవక్‌నగర్ బస్తీలో ప్రమాదం జరిగే సంఘటనలు ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని కోరుతూ సేవక్‌నగర్ జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సీతారాం పేట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కు వినతి పత్రం అందజేశారు. సేవక్ నగర్ లో విద్యుత్ తీగలు తెగి పడే స్థితిలో ఉన్నాయని, ఇబ్బంది కరంగా ఉండి స్థానిక ప్రజలకు భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయని వాటి మర్మతులు చేయాల్సిందిగా సీతారాంపేట ఎ ఇ ని కోరారు. ప్రస్తుతం గణేష్ చతుర్థి సమీపిస్తుండడంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన ఇబ్బందికర విద్యుత్ తీగలను వెంటనే తొలగించాల్సిందిగా ధరకాస్తులో కోరారు. ఈ కార్యక్రమంలో సేవక్‌నగర్ జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ సబ్యులు ఆర్. శివ కుమార్ పి. సాయి కుమార్, ఎన్. ప్రేమ్ కుమార్, ఎ. వినోద్, పి కైలాష్ తదితరులు వినతిపత్రం అందించిన వారిలో ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....