విశాఖపట్నం, అక్టోబరు 27 (ఇయ్యాల తెలంగాణ) : నైరుతి `ఆగ్నేయ బంగా ళాఖాతం మధ్య మొంథా తుఫాన్ కేంధ్రీకృతమైంది.విశాఖ కు దక్షిణ ఆగ్నేయంగా 600 కిలోవిూట ర్లు, కాకినాడ కు దక్షిణ ఆగ్నేయంగా 570కిలోవిూటర్ల, చెన్నయి తూర్పు ఆగ్నేయంగా 520 కిలోవిూటర్ల,పోర్ట్ బ్లెయర్ కు పశ్చిమంగా 750 కిలో విూటర్ల దూరంలో మొంథా తుఫా న్ కొనసాగుతోంది.ఇది ఉత్తర వాయువ్యంగా కదిలి రాగాల 12గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది.మరో 24 గంటల్లో మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సవిూపంలో తీవ్ర తుఫాన్ గానే తీరం దాటే అవకాశం ఉంది.తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110, కిలోవిూ టర్ల వేగంతో ఈదురు గాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
- Homepage
- iyyala telangana
- వేగంగా కదులుతోన్న మొంథా తుపాను
వేగంగా కదులుతోన్న మొంథా తుపాను
Leave a Comment