Vande Bharath స్లీపర్‌ రెడీ…!

చెన్నై, అక్టోబర్ 29 (ఇయ్యాల తెలంగాణ) :  భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం భారత రైల్వే ఈ స్లీపర్‌ ట్రైన్‌ను అత్యానిధునిక హంగులతో తీర్చిదిద్దింది. దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు విలాస వంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా విమానాల స్ఫూర్తితో కూడిన ఇంటీరియర్‌లు, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన భద్రతా వ్యవస్థలతో ప్రీమియం అనుభవాన్ని అందిచేలా క్యాబిన్‌ను డిజైన్‌ చేసింది. అయితే వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లోని ఫస్ట్‌క్లాస్‌ క్యాబిన్‌కు సంబంధించిన నమూనా వీడియో ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది.ఈ నమూనా వీడియోలో ఫస్ట్‌`క్లాస్‌ స్లీపర్‌ క్యాబిన్‌లు, ఎర్గోనామిక్‌ సీటింగ్‌, ఆటోమేటిక్‌ డోర్లు, రీడిరగ్‌ లైట్లు, వై`ఫై కనెక్టివిటీ, ఙూః ఛార్జింగ్‌ పాయింట్లు, డిజిటల్‌ డిస్‌ప్లే ప్యానెల్‌లు, సెన్సార్‌ ఆధారిత లైటింగ్‌ ఉన్నాయి. ఇవి నెటిజన్లను ఎంతగానో అకర్షించాయి.

ఇది చూడ్డానికి చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు ఈ డిజైన్‌ను ప్రశంసిస్తూ, భారతదేశ ఇంజనీరింగ్‌ పురోగతిపై గర్వం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ప్రజా రవాణాలో అలాంటి లగ్జరీని క్యాబిన్‌లను ఏర్పాటు చేస్తే.. జనాలు వాటిని నాశనం చేస్తారని చెప్పుకొచ్చారు.మరికొందరు ఈ ప్రీమియం సేవలను పొందే అర్హతను నిర్ణయించడానికి క్రెడిట్‌ స్కోర్‌ మాదిరిగానే ‘‘పౌర స్కోర్‌’’ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కామెంట్‌ చేశారు. ఇదిలా ఉండగా భారతదేశపు మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌లో ప్రయాణించేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మరో వ్యక్తి కామెంట్‌ చేశారు.ఇక దేశంలో మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ఢల్లీి`పాట్నా మార్గంలో నడవనున్నట్టు తెలుస్తోంది. ఈ ట్రైన్‌ గంటకు 160 కి.విూ వేగంతో నడుస్తుంది. ఈ మొట్టమొదటి వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ 16`కోచ్‌ల కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది, ఇందులో పదకొండు ంఅ 3`టైర్‌ కోచ్‌లు, నాలుగు ంఅ 2`టైర్‌ కోచ్‌లు, ఒక ంఅ ఫస్ట్‌ క్లాస్‌ కోచ్‌ ఉంటాయి, 823 స్లీపర్‌ బెర్త్‌లతో దాదాపు 1,128 మంది ప్రయాణికులకు వసతి కల్పిస్తుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....