బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఇయ్యాల తెలంగాణ) : బాబూ జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ బషీర్ బాగ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాత్ముల జయంతి వేడుకల్లో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. శివకుమార్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సి. సత్యనారాయణ, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వర్కాల సత్యనారాయణ, ఎడ్యుకేషనలిస్ట్ జె. రామ రాజు తదితరులు పాల్గొన్నారు.
