
హైదరాబాద్, జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ తెలంగాణ జన సమితి పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రామ్ చందర్ ను పాతనగరం ఉమ్మడి దేవాలయాల వృత్తిదారుల సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు. ఆది కాలం నుండి గ్రామదేవతలకు విశిష్ట పూజలు నిర్వహిస్తూ విశిష్ట కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం సభ్యుల పాత్ర కీలకమని వినతి పత్రంలో పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని ప్రొ. కోదండరాం ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం తమను గుర్తించి దేవదాయ శాఖ నుండి గుర్తింపు కార్డు యూనిఫామ్ కట్న కానుకలు ఇవ్వాల్సిందిగా కృషి చేయాలని వృత్తి దారుల సంఘం సభ్యులు విన్నవించారు. ఎన్నో సంవత్సరాల నుండి గ్రామ దేవతలకు సేవలు చేస్తూ బోనాల పండుగలో అమ్మవారి ఆహ్వానం పలికి సాగనంపే వరకు వివిధ కార్యక్రమాలు చేస్తూ వస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలని ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ కి కోరడం జరిగింది. ఈ సందర్బంగా ఆయనను శాలువాతో సత్కరించి అమ్మవారి ఫోటో ప్రతిమను బహూకరించారు. ఈ కార్యక్రమంలో వృత్తి దారుల సంఘం అధ్యక్షులు పేరోజి మహేశ్వర్ ప్రధాన కార్యదర్శి కొల్లూరు జ్ఞానేశ్వర్ కోశాధికారి గట్టు సుదర్శన్ సంఘం సలదారులు నాజీల కృష్ణ బొమ్మరాజు దేవేందర్ పేరోజి ప్రదీప్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కొల్లూరు వెంకటేష్ బర్రెల జగదీష్ ముష్కిపేట శ్రీకాంత్ బొమ్మల పాండు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వడ్ర నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.