ఈ ప్రమాదంలో ఐదుగు మృతి .. 14 మంది తీవ్రంగా గాయాలు
శ్రీనగర్ ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ) : జమ్ముకశ్మీర్ రాష్ట్రంపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్రంగా కష్టాలు పడుతున్నారు. మంగళవారం కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్కూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. ఘటనస్థలిలో అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.